కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదల కోసం ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్ విధానాన్ని.... తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయాలని రెడ్డి సంఘం ఆధ్వర్యంలో కర్నూలులో ధర్నా నిర్వహించారు. అగ్రవర్ణాల్లో పేదలు ఎలాంటి రిజర్వేషన్లు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
వారి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పది శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయలని ముఖ్యమంత్రిని కోరారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఈడబ్ల్యూఎస్ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అందరూ ఏకమై ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చదవండి