కర్నూలు జిల్లా యాగంటి ఆలయంలో కార్తిక మాసం ఆఖరి సోమవారం అయినందున భక్తులు పెద్ద సంఖ్యలో పరమశివుడి దర్శనానికి తరలివచ్చారు. ఉమామహేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. ముందుగా భక్తులు కోనేటిలో స్నానాలు ఆచరించి అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో ఉన్న వెంకటేశ్వరస్వామి, బసవయ్యకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో ప్రసాద్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఇదీ చదవండి: