కర్నూలు జిల్లా జోన్నగిరిలో ఎస్సై సురేశ్‌పై దాడి చేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు దళిత సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. విధి నిర్వహణలో ఉన్న అధికారిపై దాడి చేసిన వాళ్లపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాల నాయకులు చంద్రప్ప డిమాండ్ చేశారు.
సోమవారం రాత్రి జోన్నగిరిలో బీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన కొందరు గొడవపడ్డారు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై సురేశ్‌పై కొందరు దాడి చేసినట్లు చంద్రప్ప పేర్కొన్నారు.