ETV Bharat / state

కర్నూలు జిల్లాలో పంట నష్టంపై అధికారుల నివేదిక - report on crop lost news

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు జిల్లాలో రెండు రోజులుగా పడుతున్న వానలకు పంటలు, రోడ్లు దెబ్బతిన్నాయని కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. వాగులు, వంకల్లో ప్రవాహం ఎక్కువగా ఉందని.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

కర్నూలులో వర్షబీభత్సం
కర్నూలులో వర్షబీభత్సం
author img

By

Published : Nov 28, 2020, 10:54 AM IST

తుపాను కారణంగా కర్నూలులో పరిస్థితులు

నివర్ తుపాను రైతుల కష్టాన్ని నీటిపాలు చేసింది. కర్నూలు జిల్లాలో మొత్తం 15,788 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. 479 హెక్టార్లలో ఉద్యాన పంటలు, 232 హెక్టార్లలో అరటి తోటలు పాడైనట్లు నివేదికలో స్పష్టం చేశారు. చాగలమరి, ఆళ్లగడ్డ మండలాలలో 3.4 కిలోమీటర్ల మేర రహదారులు, 34 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలియజేశారు.

ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో వరద ప్రభావం ఉంటుందని కలెక్టర్​ తెలిపారు. వర్షం తీవ్రత తగ్గకపోవటంతో వాగులు, వంకలు పొంగుతున్నాయన్నారు. ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కోవెలకుంట్ల, ప్యాపిలి మండలాల్లో పంట నష్టపోయిన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రైతన్నలకు తీవ్రనష్టం:

వర్షాల నుంచి పంట ఉత్పత్తులను రక్షించేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కోసిన పంటలు కూడా వానలకు తడిసిపోయాయి. వరి, జొన్న, పత్తి, మినుము, వేరుశెనగ, అరటి, మిర్చి, పసుపు, ఉల్లి పంటలకు నష్టం జరిగింది. జిల్లాలో 42 గొర్రెలు, మేకలు మృతి చెందాయి. ఈ తుపాను వల్ల దాదాపు వందకోట్ల రూపాయల వరకు నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి: పెన్నాకు వరదపోటు...జలదిగ్బంధంలో నెల్లూరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.