ETV Bharat / state

'పత్తికి గిట్టుబాటు ధర కల్పించండి' - కర్నూలులో పత్తి రైతుల ఆవేదన

కర్నూలు జిల్లాలో పత్తి రైతులు నష్టాల పాలవుతున్నారు. నాణ్యత లోపం ఉందని క్వింటాల్ రూ.4వేల లోపే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు.

cotton farmers problems at kurnool district
పత్తికి గిట్టూబాటు ధర కల్పించండి
author img

By

Published : Jan 26, 2020, 3:54 PM IST

కర్నూలు జిల్లా ఆదోనిలో దాదాపు లక్షా 50 వేల ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తారు. దాదాపు 70 శాతం మంది రైతులు ఈ పంటపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో అప్పు చేసి రెండు మూడుసార్లు విత్తనాలు వేసి భారీగా పెట్టుబడులు పెట్టారు. కానీ రైతులకు ఈ ఏడాది నష్టమే మిగిలింది. ఒకప్పుడు ఎకరాకు 14 క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి వచ్చేది. ఇప్పుడు ఎకరాకు మూడు నాలుగు క్వింటాళ్లు మాత్రమే వస్తుందని రైతులు వాపోతున్నారు.

పత్తికి గిట్టూబాటు ధర కల్పించండి

ఆదోని మార్కెట్​యార్డ్​లో ప్రతి రోజు 10 నుంచి 15 వేల క్వింటాళ్ల పత్తి విక్రయాలు జరుగుతాయి. దళారులు నాణ్యత లోపం ఉందని క్వింటాల్ రూ.4వేల లోపే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు మాత్రం గరిష్ట ధర రూ.5200 పలుకుతుందని చెబుతున్నారు. ఒకటి,రెండు పత్తి చెక్కులకు మంచి ధర వస్తుంది. మిగత పత్తి చెక్కులకు ధర రూ.3 వేల నుంచి రూ.4వేల లోపే ఇస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి: ఎమ్మిగనూరులో రూ.70 లక్షల పత్తి విత్తనాలు స్వాధీనం

Intro:ap_knl_71_26_cotton_farmers_problems_vo_pkg_ap10053

రెండు తెలుగు రాష్ట్రాల్లో పత్తి పంటకు ప్రఖ్యాతిగాంచిన ప్రాంతం కర్నూలు జిల్లా ఆదోని. ఇక్కడ దాదాపు లక్షా 50 వేల ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తారు. దాదాపు 70 శాతం మంది రైతులు ఈ పంట పైన ఆధారపడి జీవిస్తారు. వర్షాభావ పరిస్థితులతో అప్పు చేసి రెండు మూడుసార్లు విత్తనాలు వేసి భారీగా పెట్టుబడులు పెట్టిన రైతులకు ఈ ఏడాది నష్టమే మిగిలింది .ఒకప్పుడు ఎకరాకు కు 14 క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి వచ్చేది. ఇప్పుడు ఎకరాకు మూడు నాలుగు క్వింటాళ్లు మాత్రమే వస్తుంది.

యార్డ్ లో ప్రతి రోజు 10 వేల -15 వేల క్వింటాలు పత్తి విక్రయాలు జరుగుతాయి.దళారులు నాణ్యత లోపం ఉందని క్వింటాల్ 4000 రూపాయలు లోపే కొనుగోలు చేస్తారు...కానీ అధికారులు మాత్రం గరిష్ట ధర 5200 పలుకుతుందని అంటున్నారు.ఒకటి,రెండు పత్తి చెక్కు లకు మంచి ధర వస్తుంది. మిగత పత్తి చెక్కులకు ధర 3 వేల నుండి 4000వేల లోపే అమ్మకాలు అవుతున్నాయి...అధికారులు పట్టిచుకొని గిట్టు బాటు ధర కల్పించాలని రైతులు ఆవేదన చెందుతున్నారు.సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభించిన నిబంధనలతో అక్కడికి వెళ్లడం లేదు....ప్రభుత్వం స్పందించి మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని రైతులు అంటున్నారు.

బైట్-
పత్తి రైతులు,ఆదోని.

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.