ETV Bharat / state

కర్నూలు జిల్లాలో కొనసాగుతోన్న కరోనా ఉద్ధృతి - కర్నూలు జిల్లా వార్తలు

కర్నూలు జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతోంది. రాష్ట్రంలోనే అత్యధిక కేసులు నమోదవడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కొవిడ్ కట్టడికి తీసుకోవలసిన చర్యలను పటిష్ఠంగా అమలు చేస్తున్నారు.

Coronavirus prevalence in Kurnool district
కర్నూలు జిల్లాలో కొనసాగుతోన్న కరోనా వైరస్ ఉద్ధృతి
author img

By

Published : May 5, 2020, 4:16 PM IST

మే 05 నాటికి 516 పాజిటివ్ కేసులు...

జిల్లాలో మార్చి 28వ తేదీన మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదు కాగా... ఏప్రిల్ 5నాటికి ఈ సంఖ్య 56కు చేరింది. ఏప్రిల్ 18వ తేదీ నాటికి 132 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మరో 12 రోజుల్లోనే ఏకంగా 254 పాజిటివ్ కేసుల నమోదుతో.. ఏప్రిల్ 30 నాటికి కరోనా కేసుల సంఖ్య 386కు చేరింది.

మే ఒకటో తేదీ నుంచి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒకటిన 25, రెండోతేదీ 25, మూడో తేదీ 30, నాలుగో తేదీ 25, నేడు 25 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు జిల్లాలో 516 మందికి కరోనా సోకినట్లు ప్రభుత్వం తెలిపింది. కరోనా నుంచి కోలుకుని 114 మంది డిశ్ఛార్జ్ కాగా... 10 మంది మృతి చెందారు. మిగిలిన 392 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఆగమేఘాల మీద కరోనా గుర్తింపు చర్యలు...

కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం లాక్​డౌన్ ప్రకటించిన వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. విదేశాల నుంచి వచ్చినవారిని గుర్తించి హోం క్వారంటైన్ లో ఉంచారు. సంజామల మండలంలో రైల్వే పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రాజస్థాన్​కు చెందిన యువకుడికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. దిల్లీలోని మర్కజ్​కు వెళ్లి వచ్చిన సుమారు 400 మందిని ప్రభుత్వ క్వారంటైన్లకు తరలించి... పరీక్షలు నిర్వహించారు. వీరిలో సుమారు 75 మందికి కరోనా ఉన్నట్లు తేలింది.

పాజిటివ్ రోగుల కుటుంబసభ్యులు, బంధువులను క్వారంటైన్లకు తరలించి పరీక్షలు నిర్వహించగా... మరికొందరికి కరోనా నిర్ధారణ అయ్యింది.

అత్యవసర సిబ్బందినీ వదలని మహమ్మారి...

కర్నూలు నగరానికి చెందిన ఓ వైద్యుడు కరోనా లక్షణాలతో సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆ వైద్యుడి కుటుంబంలో ఆరుగురికి కరోనా ఉన్నట్లు తేలింది. సర్వజన వైద్యశాలలో పని చేసే అనస్తీషియా వైద్యురాలికి, ప్రైవేటు ఆసుపత్రుల్లో పని చేసే ముగ్గురు వైద్యులకు, పెద్దాసుపత్రిలోని వైద్య విద్యార్ధినికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వీరి వద్ద వైద్యం పొందిన వారిని గుర్తించి పరీక్షలు నిర్వహించారు.

జిల్లాలోని ఓ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లకూ కొవిడ్ సోకింది. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేసే ఓ ఉన్నతాధికారికి, ఆయన వ్యక్తిగత సహాయకుడికి కరోనా వచ్చింది.

కర్నూలు నగరంలోనే అత్యధికం..

కర్నూలు నగరం, నంద్యాల పట్టణంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయని జిల్లా పాలనాధికారి వీరపాండియన్ తెలిపారు. ఈనెల 4వ తేదీ వరకు కర్నూలు నగరంలో 306, నంద్యాల పట్టణంలో 101, నంద్యాల రూరల్ ప్రాంతంలో 9, నందికొట్కూరు పట్టణంలో 10, కోడుమూరు 11, పాణ్యం 8, బనగానపల్లె, ఆత్మకూరులో 7, చాగలమర్రి 5, పాములపాడు 4, శిరివెళ్ల 3, గడివేముల, కల్లూరు 2, బేతంచెర్ల , డోన్ , ఆదోని పట్టణం, ఆస్పరి, బండిఆత్మకూరు , గోనెగండ్ల , కృష్ణగిరి , ఓర్వకల్లు, అవుకు, రుద్రవరం, తుగ్గలి, వెల్దుర్తి, సంజామల,కర్నూలు రూరల్, నందికొట్కూరులో ఒక్కొక్కటి చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇదీచదవండి.

స్థలం విషయంలో ఘర్షణ.. వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.