కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఆరోగ్యం నిలకడగా ఉందని.. ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నానని ఎమ్మెల్యే తెలిపారు. ఎవరూ ఆందోళన చెందవద్దని సామాజిక మాధ్యమం ద్వారా విజ్ఞప్తి చేశారు. కరోనా రెండో సారి వచ్చే అవకాశం ఉందని.. ఇప్పటికే తమ కుటుంబ సభ్యుల్లో ఒకరికి వచ్చిందని చెప్పారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నెల 26న నంద్యాల కూరగాయల మార్కెట్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఇదీ చదవండి: