కర్నూలు జిల్లా ఎదురుపాడులో కరోనా పరీక్షల ఫలితాలు భిన్నంగా రావడంతో ఓ కుటుంబం ఆందోళన చెందుతోంది. గ్రామానికి చెందిన పవిత్ర ఈనెల 5న ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి ప్రసవం కోసం వెళ్లింది. అక్కడ ఆమెకు కొడుకు పుట్టాడు. ఆ సమయంలో ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. వెంటనే వైద్యులు కర్నూలుకు వెళ్లమని చెప్పారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి ఆమె వెళ్లగా..అక్కడ నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. కర్నూలు ఆసుపత్రి వైద్యులు ఇంటికి వెళ్లి హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. పరీక్ష ఫలితాలు తమకు ఆందోళన కలిగిస్తున్నాయని... బాలింత కాబట్టి కొన్ని రోజులు ఆసుపత్రిలో చికిత్స అందించాలని బాధితురాలి భర్త కోరుతున్నారు.
ఇదీ చూడండి. 'సంబంధం లేదంటే అమరావతి రైతుల త్యాగాలను అవమానించినట్లే'