కర్నూలు జిల్లా ఆత్మకూరులో కరోనా పరీక్షల కోసం జనం ఎగబడ్డారు. ఈ మధ్య కాలంలో ఆత్మకూరులో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న కారణంగా... అధికారులు ఈ ప్రాంతంలో పరీక్షలు నిర్వహించాలని భావించారు. అందులో భాగంగా ఎండీఓ కార్యాలయంలో నమూనాలు సేకరించారు.
ఈ విషయం తెలుసుకున్న జనం భారీగా అక్కడకు చేరుకున్నారు. ఓ వైపు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం.. మరోవైపు అధికారులు వారిని నిలువరించలేక అలాగే పరీక్షలు నిర్వహించడంపై.. స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లో.. ఇంత నిర్లక్ష్యం మంచిది కాదన్నారు.
ఇవీ చూడండి:
అయ్యో పాపం: అమ్మ, చెల్లెమ్మ కోసం.. పదేళ్ల పసివాడు.. ఎంతటి కష్టం చేశాడమ్మా!