కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ సూచించారు. భౌతికదూరం పాటిస్తూ.. మాస్కులు తప్పక ధరించి, తరుచూ చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలన్నారు. వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలన్నారు. జిల్లాలో ఇప్పటికే 739 మందికి కరోనా సోకగా.. అందులో 26 మంది చనిపోయారని కలెక్టర్ తెలిపారు. చిన్నపిల్లలు, వృద్ధులకు కరోనా లక్షణాలు ఉంటే వెంటనే జిల్లాలోని ప్రైమరీ హెల్త్ కేంద్రాలకు వెళ్లి పరీక్షలు చెయించుకోవాలని చెప్పారు. హోం క్వారంటైన్ కు అవకాశం ఉంటే అనుమతి ఇస్తామని కలెక్టర్ తెలిపారు.
ఇదీ చదవండి: వ్యాపార దిగ్గజం టాటాకు 27 ఏళ్ల కుర్రాడితో స్నేహం!