కర్నూలు జిల్లాలో గ్రామ వలంటీర్ల నియామకం.. గందరగోళంగా మారింది. 300 మంది వాలంటీర్లకు సంబంధించిన జాబితాను అధికారం గురువారం విడుదల చేయాల్సి ఉంది. అయినా... శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ఎంపీడీవో కార్యాలయ గోడలకు అధికారులు జాబితాను అతికించి వెళ్లిపోయారు. కొందరు వైకాపా నాయకులు తమ వారి పేర్లు లేవని ఆగ్రహిస్తూ... జాబితాను చింపేశారు. అనంతరం.. అధికారులు సోమవారం ఉదయం మరో జాబితా విడుదల చేశారు. మొదటి జాబితాలో ఎంపికైన అభ్యర్ధులు.. తమ పేర్లు తుది జాబితాలో లేవంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కారణాలు తెలపాలని ఎంపీడీవో ఆదాయ్యను నిలదీశారు. ఈ కారణంగా తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎస్సై అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి మొదటి జాబితాలో ఎంపికైన అభ్యర్థులతో మాట్లాడారు. ఎంపీడీవో కలెక్టర్ కార్యాలయంతో సంప్రదించగా....కర్నూలుకు రమ్మని పిలిచినట్లు తెలిసింది.
మొదటి జాబితాలో పేరుంది.. రెండో జాబితాలో మాయమైంది! - Controversy over the recruitment of village volunteers_in_kurnool
ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వాలంటీర్ల నియామకం... కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో గందరగోళంగా మారింది. అధికారులు అతికించిన జాబితాను వైకాపా నేతలు చించేశారు.
కర్నూలు జిల్లాలో గ్రామ వలంటీర్ల నియామకం.. గందరగోళంగా మారింది. 300 మంది వాలంటీర్లకు సంబంధించిన జాబితాను అధికారం గురువారం విడుదల చేయాల్సి ఉంది. అయినా... శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ఎంపీడీవో కార్యాలయ గోడలకు అధికారులు జాబితాను అతికించి వెళ్లిపోయారు. కొందరు వైకాపా నాయకులు తమ వారి పేర్లు లేవని ఆగ్రహిస్తూ... జాబితాను చింపేశారు. అనంతరం.. అధికారులు సోమవారం ఉదయం మరో జాబితా విడుదల చేశారు. మొదటి జాబితాలో ఎంపికైన అభ్యర్ధులు.. తమ పేర్లు తుది జాబితాలో లేవంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కారణాలు తెలపాలని ఎంపీడీవో ఆదాయ్యను నిలదీశారు. ఈ కారణంగా తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎస్సై అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి మొదటి జాబితాలో ఎంపికైన అభ్యర్థులతో మాట్లాడారు. ఎంపీడీవో కలెక్టర్ కార్యాలయంతో సంప్రదించగా....కర్నూలుకు రమ్మని పిలిచినట్లు తెలిసింది.
TAGGED:
గ్రామ వాలంటీర్లు