ETV Bharat / state

బాధిత రైతు కుటుంబాలకు భరోసా

author img

By

Published : Feb 24, 2020, 5:27 PM IST

ఆళ్లగడ్డలో పంట నష్టం, అప్పులు బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం నుంచి మంజూరైన పరిహారం పత్రాలను బాధిత కుటుంబ సభ్యులకు పంపిణీ చేశారు. బాధిత కుటుంబాలకు ఈ పరిహారం 48 గంటల్లో వారి ఖాతాల్లో జమ చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

compensation given to died farmer families in allagadda
రైతు కుటుంబానికి ఏడు లక్షల రూపాయల మేర పరిహారం

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహార పత్రాలను శాసనమండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు విల్సన్ పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితులను గుర్తించామని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు విల్సన్​ అన్నారు. జిల్లాలోని ఒక్కో రైతు కుటుంబానికి ఏడు లక్షల రూపాయల మేర పరిహారం అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి :

రోడ్డు ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుడి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.