'శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారు' - హిందూ సంఘాలు ఆగ్రహం - TIRUMALA LADDU ISSUE - TIRUMALA LADDU ISSUE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 21, 2024, 3:18 PM IST

Hindu Communities Protested Against Adulteration of Srivari Laddu Prasad : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో జరిగిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కోట్లాది మంది ఆరాధించే తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారని మండిపడ్డారు. హిందూ దేవాలయాల పరిరక్షణ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పటమట పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయనున్నట్లు ట్రస్టు ప్రతినిధులు తెలిపారు. 

దేవునిపై నమ్మకం లేని వారు ట్రస్ట్​లో సభ్యులుగా ఉండటం మూలంగానే జరిగిందని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ట్రస్ట్​ను ఒక వ్యాపార కేంద్రంగా మార్చుకున్నారని ఆరోపించారు. స్వామి వారి ప్రసాదంలో వినియోగించడానికి వీలు లేని పదార్థాలను ఉపయోగించి తిరుమల లడ్డూలను అపవిత్రం చేశారని మండిపడ్డారు. త్వరలోనే గవర్నర్​ను కూడా కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. తిరుమల లడ్డూ వివాదంపై హిందూ దేవాలయాల పరిరక్షణ ట్రస్టు చేపట్టిన ఉద్యమ భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.