ETV Bharat / state

నేడు ఓర్వకల్లు విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్ - Orvakal Airport

కర్నూలు విమానాశ్రయం అన్ని హంగులతో అందుబాటులోకి వచ్చింది. విమానాశ్రయ టెర్మినల్‌ భవనాన్ని...సీఎం జగన్‌ నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈనెల 28 నుంచి ప్రయాణికుల కోసం ఇండిగో విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

నేడు ఓర్వకల్లు విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్

author img

By

Published : Mar 24, 2021, 8:16 PM IST

Updated : Mar 25, 2021, 4:02 AM IST

కర్నూలు విమానాశ్రయం నుంచి...ప్రయాణికుల విమాన రాకపోకలకు రంగం సిద్ధమవుతోంది. ఉడాన్‌ పథకంలో భాగంగా ఇండిగో సంస్థ తమ సర్వీసులను ఈనెల 28 నుంచి ప్రారంభించనుంది. కర్నూలు నుంచి బెంగళూరు, విశాఖపట్నం, చెన్నైకు..విమాన సేవలు మొదలుపెట్టి సర్వీసులు విస్తరించనున్నారు. ప్రయాణికుల రాకపోకలకు తగ్గట్లు..సకల సౌకర్యాలతో విమానాశ్రయం ముస్తాబైంది. నూతన సాంకేతికతతో...ఏటీసీ టవర్‌, టెర్మినల్‌ భవనం, రాత్రిళ్లు విమానాలు దిగే సమయంలో విద్యుత్తు టవర్లు గుర్తించేలా...ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అన్ని పనులూ పూర్తవడంతో విమానాశ్రయ టెర్మినల్‌ భవనాన్ని..సీఎం జగన్‌ నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటల 45 నిమిషాలకు...ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న సీఎం...మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాలకు ప్రారంభిస్తారు. ప్రత్యేక పోస్టల్‌ స్టాంపులు ఆవిష్కరిస్తారు. 12 గంటల 45 నిమిషాలకు తిరుగుపయనమవుతారు.

నిజానికి 2019 ఎన్నికలకు ముందు నాటి సీఎం చంద్రబాబు..ఈ విమానాశ్రయాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఓర్వకల్లు సమీపంలో 2017 జూన్‌లో శంకుస్థాపన చేసి..2019 నాటికి 90 శాతం పనులు పూర్తిచేసి 2019 జనవరి 8న అధికారికంగా ప్రారంభించారు.

అనంతరం ఎన్నికలు రావటం, గుత్తేదారు నష్టం వచ్చిందని పనులు ఆపడంతో..ప్రయాణికుల విమాన సర్వీసుల అందుబాటులోకి తేవడం ఆలస్యమైంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్యాసింజర్‌ టెర్మినల్‌, రన్‌వే, వీఐపీ లాంజ్‌, విద్యుత్‌ ఉపకేంద్రం, సెక్యూరిటీ బ్యారక్‌ తదితర పెండింగ్‌ పనులు పూర్తిచేశారు. వివిధ రాజకీయ పార్టీల అధినేతల కోసం ఇక్కడి నుంచి ఇప్పటి దాకా 36 సార్లు...విమానం ఎగిరింది. ఇకపై సాధారణ ప్రయాణికులకూ అందుబాటులోకి రానుంది. త్వరలో పైలెట్‌ శిక్షణ కేంద్రం, కార్గో సేవలూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

నేడు ఓర్వకల్లు విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్

ఇదీ చదవండి:

నెలలో కోటి మందికి టీకాలు వేయాలి: సీఎం జగన్

Last Updated : Mar 25, 2021, 4:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.