కర్నూలు జిల్లా నంద్యాలలో ముస్లిం కుటుంబం ఆత్మహత్య ఘటనపై సీఎం జగన్ తీవ్రంగా పరిగణించారు. డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధ్యులపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఘటన జరిగిన 24 గంటల్లోనే బాధ్యులపై పోలీసు ఉన్నతాధికారుల చర్యలు తీసుకున్నారు.
విషాదంపై లోతైన దర్యాప్తు కోసం ఇద్దరు ఐపీఎస్‌లు బెటాలియన్స్ ఐజీ శంకబ్రత బాగ్చీ, గుంటూరు అడిషనల్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్‌ను నియమించిన సీఎం.... వారిని వెంటనే నంద్యాలకు వెళ్లాలని ఆదేశించారు. ఘటనపై హోం మంత్రి, డీజీపీ నుంచి నివేదిక కోరారు. సీఎం ఆదేశాలతో 24 గంటల్లోనే ఘటనకు బాధ్యులుగా గర్తించి సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
ఉద్దేశపూర్వకంగా వేధించడం, బాధించడం, మారణాయుధాలు చూపి లేదా ఆ తరహాలో బెదిరించడం, ఆత్మహత్యకు పురిగొల్పడం వంటి అంశాల కింద సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌పై కేసులు నమోదు చేశారు.
ఇదీ చదవండి: