కర్నూలు జిల్లా ఆదోనిలో లాక్డౌన్ కొనసాగుతోంది. జిల్లాలో పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతున్న తరుణంలో పోలీసులు నిబంధనలను కఠినతరం చేస్తున్నారు. ఎవరూ బయటకు రావద్దని పోలీసులు చెబుతున్నా కొందరు రోడ్లపై తిరుగుతూ అసహనం కలిగిస్తున్నారు. ఇలా సరదాగా బయటకు వచ్చే వారిని గుర్తించి 150 వాహనాలను సీజ్ చేశారు. బయటకు వచ్చిన వారితో ఇంకోసారి బయటకు రాకుండా పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు. నిబంధనలను అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి.