కర్నూలు జిల్లా కొండమ్మనాయుడుపల్లెలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. గ్రామంలో మురుగునీటి సమస్య, మంచినీటి విషయంలో ఇరు వర్గాల వారు రాళ్లతో దాడి చేసుకున్నారు. దాడిలో కోనేటి రామాంజి, కోనేటి కొండన్న, నల్ల పెద్దన్న, నొస్సం శ్రీనుతో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయాలైనవారిని బనగానపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో పోలిస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఇరు వర్గాల వారిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: