కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలం మోత్కులపల్లె గ్రామంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇళ్ల స్థలాల వ్యవహారమే ఘర్షణకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: అవినీతిని ఎండగడితే హత్య చేయిస్తారా?: లోకేశ్