ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూములను వైద్య కళాశాలకు కేటాయించాలనే నిర్ణయాన్ని విరమించుకోవాలని కర్నూలు జిల్లా నంద్యాలలో నిరసన వ్యక్తమవుతోంది. సీఐటీయూ ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మికులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు ధర్నా చేపట్టారు. పరిశోధన స్థానం భూములను తగ్గించవద్దని కోరారు. సంబంధిత జీవోను రద్దు చేసి, వైద్యకళాశాలకు మరోచోట స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: