కర్నూలు జిల్లా నంద్యాలలో ఈ నెల 2 న తాత్కాలికంగా నిలిచిపోయిన పసుపు కొనుగోళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. కొనుగోలు కేంద్రానికి రైతుల పేరుతో దళారులు వస్తున్నారనే ఆరోపణలతో అధికారులు కొనుగోళ్లు నిలిపివేశారు. గ్రామస్థాయిలో విచారణ జరిపిన తరువాత.. తిరిగి కొనుగోళ్లు చేపట్టారు. ప్రస్తుతం 1150 మంది రైతులు పసుపు కొనుగోలుకు తమ పేర్లను కేంద్రంలో నమోదు చేసుకున్నారు. ఇంతవరకు 350 మంది రైతులకు చెందిన 11 వేల 500 క్వింటాళ్ల పసుపు కొనుగోలుకు నోచుకుంది. కనీస మద్దతు ధర క్వింటాకు రూ.6,850 తో రైతుల నుంచి పసుపు కొనుగోలు చేసే క్రమంలో గత నెల 14న నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అధికారులు.
ఇదీ చదవండి: ఎల్జీ పాలిమర్స్ కేసు: హైకోర్టు తీర్పుపై 'స్టే'కు సుప్రీం నిరాకరణ