కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలో మార్చి 9 నుంచి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాలపై నంద్యాల ఆర్డీవో కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సబ్ కలెక్టర్ కల్పన కుమారి సమీక్ష నిర్వహించారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొవిడ్ ను దృష్టిలో పెట్టుకుని ఉత్సవాలు జరపాలన్నారు. ఈ సమావేశంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాద్, వేదపండితులు, అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: