ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు ఓ యువకుడు నీటిలో కొట్టుకుపోయాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాల చామ కాలువలో జరిగింది. పట్టణంలో సుందరయ్యనగర్‌కు చెందిన దుర్గాప్రసాద్ స్నేహితులతో సాయిబాబా నగర్ వద్ద వంతెనపై నుంచి చామ కాలువలో దూకాడు. ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయాడు. స్నేహితుడు నాగూర్ బాషా అతనిని కాపాడే ప్రయత్నం చేశాడు. ఆయన ప్రయత్నం ఫలించలేదు. దుర్గాప్రసాద్ కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్నేహితులు చామ కాలువలో గాలిస్తున్నారు.
ఇదీ చూడండి. రాష్ట్రంలో కొత్తగా 8,846 కరోనా కేసులు, 69 మరణాలు