కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో తుంగభద్ర పుష్కరఘాట్లను పరిశీలించేందుకు వెళ్లిన బాజపా నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో.. ఇవాళ బాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. వీరిని రాంపురానికి ఏడు కిలోమీటర్ల దూరంలో పోలీసులు అడ్డుకున్నారు. తుంగభద్ర పుష్కర ఘాట్లు పరిశీలించేందుకు ముఖ్య నాయకులను మాత్రమే అనుమతించారు.
అనంతరం నిర్వహించిన సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడారు. రాష్ట్రంలో తెదేపా, వైకాపాకు ప్రత్యామ్నాయంగా భాజపా ఎదుగుతోందని అన్నారు. తుంగభద్ర పుష్కరాలు పూర్తయినప్పటికీ... ఘాట్ల నిర్మాణం అసంపూర్తిగా ఉన్నాయని అన్నారు. కేంద్రం నిధులతో చేపడుతున్న పథకాలను రాష్ట్ర పథకాలుగా ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు.
ఇదీచదవండి.