ETV Bharat / state

పౌరసత్వ బిల్లుపై అపోహాలు వద్దు: బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

author img

By

Published : Dec 15, 2019, 9:26 PM IST

పౌరసత్వ బిల్లు విషయంలో ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదని భాజపా నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.

bjp-leader-baireddy-rajashaker-reddy-comments-on-cab
bjp-leader-baireddy-rajashaker-reddy-comments-on-cab
పౌరసత్వ బిల్లుపై అపోహలు వద్దన భాజపా నేత బైరెడ్డి రాజశేఖర్​ రెడ్డి
రానున్న రోజుల్లో రాష్ట్రంలో భాజపా సత్తా చాటుతుందని ఆ పార్టీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. కర్నూలులో భాజపా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన... ప్రధాని మోదీ వల్ల సీమ ప్రాంతానికి మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా పోటీలో ఉంటుందన్నారు. సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు రాష్ట్రంలో పుట్టగతులు లేకుండా చేస్తామని వ్యాఖ్యానించారు. పౌరసత్వ బిల్లు విషయంలో ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదన్నారు.

Intro:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష పార్టీ లేకుండా పాలన చేసే సమయం ఆసన్నమైందని భారతీయ జనతా పార్టీ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్రెడ్డి అన్నారు. ఆదివారం ఇక సెయింట్ మేరీస్ పాఠశాల మైదానంలో భారతీయ జనతా పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వల్ల రాయలసీమకు మంచి జరిగే రోజులు దగ్గర ఉన్నాయని, రాయలసీమ ప్రాంత ప్రజలను మభ్యపెట్టి మోసగించే నాయకులకు ఇక ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడుతున్నాయన్నారు. రానున్న జెడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్, మున్సిపాలిటీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ పోటీలో ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాష్ట్రంలో పుట్టగతులు లేకుండా చేస్తామన్నారు. పౌరసత్వ బిల్లు గురించి ముస్లిం మైనార్టీలు భయపడవలసిన అవసరం లేదని, రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకునేందుకు ముస్లిం మైనార్టీలను భారతీయ జనతా పార్టీపై వ్యతిరేకత పెంచే విధంగా రెచ్చగొడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ముస్లిం మైనార్టీలకు ఎప్పుడు వ్యతిరేకం కాదని, భారతదేశంలో వారు కూడా హిందువుల్లో ఒక భాగం అన్నారు. రానున్న ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో తమ పార్టీ జెండా vigora వేస్తామని, గతంలో ఎమ్మెల్యేగా అభివృద్ధి చేసినంతగా చేసి చూపిస్తామన్నారు తమ రాజకీయ వారసురాలు తన కూతురు శబరి పేరును ప్రకటించారు.

Body:ss

Conclusion:ss

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.