వైకాపా ప్రభుత్వ పాలన తీరును నిరసిస్తూ కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య కలెక్టర్ కార్యాలయం ఎదుట అర్థనగ్న ప్రదర్శన చేపట్టారు. వైకాపాకు ఓటు వేసినందుకు ప్రజలు బాధ పడుతున్నారని.. బంగి అనంతయ్య రోడ్డుపై చెప్పుతో కొట్టుకొని నిరసన తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అన్ని నిలిచిపోయాయని... వైకాపా ప్రభుత్వం కేవలం చంద్రబాబునాయుడుపై కక్ష సాధించేందుకే సమయం కేటాయిస్తుందని ధ్వజమెత్తారు. వరద బాధితులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే... సీఎం అమెరికా పర్యటన చేయడమేంటని బంగి నిలదీశారు.
ఇదీ చదవండి