ఆటోలో మరిచిపోయిన 7లక్షల రూపాయల నగదును సీసీ కెమెరాల సాయంతో గుర్తించి తిరిగి బాధితుడికి అప్పగించిన ఘటన కర్నూలులో జరిగింది.
నగరంలోని గురురాఘవేంద్ర నగర్‌కు చెందిన మల్లికార్జున రెడ్డి తన బావమరిదితో కలిసి ఆటోలో బస్టాండ్‌కు బయలుదేరాడు. వారితో పాటు మామిడి కాయల సంచులను, ఏడు లక్షల నగదు ఉన్న సంచిని వెంట తీసుకెళ్లారు. బస్టాండ్‌కు చేరుకోగానే మామిడి కాయల సంచులను మాత్రమే తీసుకుని... నగదు సంచిని మర్చిపోయారు.
నగదు విషయం గుర్తుకు వచ్చిన బాధితుడు వెంటనే 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా దృశ్యాలను పరిశీలించి కోడుమూరు వైపు ఆటో వెళ్లినట్లుగా గుర్తించారు. అనంతరం కోడుమూరు రోడ్డు వద్ద వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు ఆటోను గుర్తించారు. ఆటో డ్రైవర్ నిజాయితీగా వ్యవహరించి నగదును పోలీసులకు అప్పగించాడు. అనంతరం నగదును బాధితుడు మల్లికార్జున్ రెడ్డికి జిల్లా ఎస్పీ అందించారు. ఆటో డ్రైవర్ నిజాయితీకి మెచ్చిన ఎస్పీ అతన్ని సన్మానించారు.
ఆటో డ్రైవర్ నిజాయితీ.. కర్నూలు ఎస్పీ సన్మానం - auto driver
ఓ ప్రయాణికుడు మర్చిపోయిన ఏడు లక్షల నగదును ఆటో డ్రైవర్ పోలీసులకు తిరిగి అందించాడు. నగదును ఏ మాత్రం ముట్టుకోకుండా నిజాయితీగా అడిగిన వెంటనే ఇచ్చిన డ్రైవర్‌ను కర్నూలు జిల్లా ఎస్పీ సన్మానించారు.
ఆటోలో మరిచిపోయిన 7లక్షల రూపాయల నగదును సీసీ కెమెరాల సాయంతో గుర్తించి తిరిగి బాధితుడికి అప్పగించిన ఘటన కర్నూలులో జరిగింది.
నగరంలోని గురురాఘవేంద్ర నగర్‌కు చెందిన మల్లికార్జున రెడ్డి తన బావమరిదితో కలిసి ఆటోలో బస్టాండ్‌కు బయలుదేరాడు. వారితో పాటు మామిడి కాయల సంచులను, ఏడు లక్షల నగదు ఉన్న సంచిని వెంట తీసుకెళ్లారు. బస్టాండ్‌కు చేరుకోగానే మామిడి కాయల సంచులను మాత్రమే తీసుకుని... నగదు సంచిని మర్చిపోయారు.
నగదు విషయం గుర్తుకు వచ్చిన బాధితుడు వెంటనే 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా దృశ్యాలను పరిశీలించి కోడుమూరు వైపు ఆటో వెళ్లినట్లుగా గుర్తించారు. అనంతరం కోడుమూరు రోడ్డు వద్ద వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు ఆటోను గుర్తించారు. ఆటో డ్రైవర్ నిజాయితీగా వ్యవహరించి నగదును పోలీసులకు అప్పగించాడు. అనంతరం నగదును బాధితుడు మల్లికార్జున్ రెడ్డికి జిల్లా ఎస్పీ అందించారు. ఆటో డ్రైవర్ నిజాయితీకి మెచ్చిన ఎస్పీ అతన్ని సన్మానించారు.
Body:పిడుగు పడి ఇద్దరి మృతి
Conclusion:పిడుగు పడి ఇద్దరి మృతి