- పేరుకే కార్పొరేషన్లు.. బీసీలకు చేయూత ఏదీ...?
వైసీపీ సర్కార్ ఆర్భాటంగా ఏర్పాటు చేసిన 56 బీసీ కార్పొరేషన్లు బీసీలకు ఆర్థిక చేయూత అందించడంలో పూర్తిగా విఫలమయ్యాయి. ఇవి కేవలం వైసీపీ నేతల రాజకీయ పునరావాసానికే పరిమితమయ్యాయి. పైసా పని కాకుండానే..వీటి ఛైర్మన్లు, డైరెక్టర్ల పదవీ కాలం ఇవాల్టితో ముగిసిపోనుంది. బీసీల స్వయం ఉపాధికి దన్నుగా నిలుస్తాయంటూ వీటిని ఏర్పాటు చేసినా..ఈమూడున్నరేళ్లలో 56 కార్పోరేషన్లకు కేవలం 132 కోట్లే ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్..! ఎంతంటే
రాష్ట్ర అప్పు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కనీసం జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్న ప్రభుత్వ దీనస్థితి సామాన్యులకు సైతం ఇప్పుడిప్పుడే అవగతమవుతోంది. అప్పు తెచ్చి ఆస్తి సృష్టించకుండా ఖర్చులు చేయడం కలవరపరుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రామోజీ ఫిల్మ్‌సిటీలో వినోదాలు పంచుతున్న వింటర్ ఫెస్ట్..
పర్యాటకుల స్వర్గధామం రామోజీ ఫిల్మ్‌సిటీలో.. లాంగెస్ట్ వింటర్‌ఫెస్ట్ ఉత్సాహంగా ప్రారంభమైంది. మధురానుభూతులు పంచే వినోద కార్యక్రమాలు.. సాంప్రదాయ, ఆధునిక నృత్యాలు, సందర్శకుల కేరింతలతో సందడిగా మారింది. అబ్బురపరిచే ప్రదర్శనలు, ఆకట్టుకునే ప్రకృతిసోయగాలతో పర్యాటకులు తడిసి ముద్దయ్యారు. క్రిస్మస్, నూతన సంవత్సరాలను ఆహ్వానిస్తూ ప్రారంభమైన వింటర్ ఫెస్ట్ వేడుకలు తొలి రోజే అంబరాన్నంటాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మైలవరం వైసీపీలో వర్గ పోరు.. సీఎం జగన్‌తో మంతనాలు
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎవరనే అంశంపై నెలకొన్న సందిగ్ధత వీడలేదు. ప్రస్తుత ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అభ్యర్థిత్వంపై సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. ఇప్పటి వరకు జరిగిన నియోజకవర్గాల సమీక్షలో పోటీ చేసే అభ్యర్థిని సీఎం ప్రకటిస్తూ వచ్చారు కానీ మైలవరం పై మాత్రం నోరు మెదపలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భోగాపురం విమానాశ్రయం ప్రారంభమైతే వైజాగ్‌లో పౌరవిమానాలు నిలిచిపోతాయి: వీకే సింగ్
భోగాపురం విమానాశ్రయం ప్రారంభమైతే ఇప్పుడున్న వైజాగ్ నావల్ ఎయిర్‌ఫీల్డ్‌లో 30ఏళ్లపాటు పౌర విమానయాన సేవలు నిలిచిపోతాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ తెలిపారు. గురువారం లోక్‌సభలో ఎంపీ రఘురామకృష్ణరాజు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'పదేళ్లు గడిచినా.. నాటి పరిస్థితులే నేటికీ'.. నిర్భయ తల్లిదండ్రుల ఆవేదన
నిర్భయ ఘటన జరిగి పదేళ్లు గడిచినా.. ఇప్పటికీ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదని నిర్భయ తల్లిదండ్రులు అన్నారు. దేశంలో ఇప్పటికీ మహిళలకు భద్రత లేదని నిర్భయ తండ్రి బద్రీ నారాయణ అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చైనాలో కరోనా మహమ్మారి విజృంభణ.. ఆస్పత్రుల వద్ద జనం బారులు!
చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. అక్కడ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. పలు చోట్ల ఆస్పత్రుల వెలుపల రోగులు క్యూకడుతున్న దృశ్యాలు బయటకొచ్చాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఐఫోన్లో ఈ సెట్టింగ్స్ మార్చుకుంటే.. 'ప్రో' ఫొటో నిపుణులు మీరే!
ఐఫోన్ల కెమెరా సామర్థ్యమే వేరు. వీటి ఫొటోల స్పష్టత గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రో సిరీస్ ఫోన్లయితే మరింత క్వాలిటీతోనూ ఫొటోలు తీస్తాయి. అయితే కొన్ని సెట్టింగ్స్ మార్చుకుంటే.. మీరు తీసే ఫొటోలు అదిరిపోతాయంతే. ఆ సెట్టింగ్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనంపై ఓ లుక్కేయండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- హార్స్ రేస్‌లో ప్రాణాలు కోల్పోయిన యంగ్ జాకీ రైడర్ అసలేం జరిగిందంటే
న్యూజిలాండ్‌కు చెందిన 26 ఏళ్ల మేఘన్ టేలర్ హార్స్ రేసులో ప్రాణాలు కోల్పోయింది. యంగ్ జాకీ రైడర్‌గా పేరు పొందిన మేఘన్ టేలర్ కాంటర్‌బరిలోని యాష్‌బర్టన్ రేస్‌వే వద్ద గురువారం జరిగిన గుర్రపు రేసులో పోటీపడింది. రేసు మధ్యలో దురదృష్టవశాత్తూ జరిగిన ప్రమాదంలో ఆమె మరణించింది. ఆ ప్రమాదం ఎలా జరిగిందంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కథకే కాదు విజయానికీ కొనసాగింపే.. ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ సీక్వెల్ సినిమాలివే..
సీక్వెల్ సినిమాల ట్రెండ్‌ను తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడో అందిపుచ్చుకుంది. హిట్టు మాట వినిపించిన సినిమాల్ని కొందరు ఫ్రాంచైజీల్లా కొనసాగిస్తే.. మరికొందరు ఓ కథను రెండు భాగాలుగా చెప్పడం మొదలు పెట్టారు. ఈ ఏడాది విడుదలై ప్రేక్షకుల మెప్పు పొందిన సీక్వెల్ సినిమాలేవో ఓ సారి చూద్దాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.