పొలం యజమానులు, గొర్రెల కాపరుల మధ్య జరిగిన ఘర్షణలో ఐదుగురు వ్యక్తులు గాయపడిన ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడేకల్లులో జరిగింది. గ్రామంలోని పొలం వద్ద ఉన్న ట్యాంకులో నీటిని తాగేందుకు కాపరులు గొర్రెలను తీసుకెళ్లారు. ట్యాంక్ పాడవుతుందని పొలం యజమానులు అభ్యంతరం వ్యక్తం చేయగా....ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో గొర్రెల కాపరులు కర్రలతో దాడి చేయడంతో ....ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. వారిని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఇవి కూడా చదవండి: