కర్నూలు జిల్లాలో రెండో డోసు వ్యాక్సిన్ ప్రక్రియ నిలిచిపోయింది. వ్యాక్సిన్ లేకపోవటంతో ఇవాళ నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రేపటి నుంచి ప్రక్రియ తిరిగి ప్రారంభం కానుంది. అర్హులైనవారికి ఆశాకార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి స్లిప్పులు ఇవ్వనున్నారు. స్లిప్పులు ఉన్నవారికే రేపటి నుంచి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. దీని వల్ల టీకా కేంద్రాల వద్ద రద్దీని నియంత్రించవచ్చని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో నిలిచిన కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ!