వేధింపులకు గురి చేసి సలాం కుటుంబాన్ని మింగేసినా ప్రభుత్వానికి రక్త దాహం తీరలేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. రాత్రిపూట సలాం కుటుంబసభ్యుల ఇంటికి పోలీసుల్ని పంపి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి అఖిల ప్రియ వద్ద సలాం కుటుంబ సభ్యులు వాపోయిన వీడియోను ఆయన ట్విటర్లో పోస్టు చేశారు.
-
టార్చర్ చేసి సలాం కుటుంబాన్ని మింగేసారు. అయినా @ysjagan ప్రభుత్వానికి రక్త దాహం తీరలేదు. రాత్రి పూట సలాం కుటుంబ సభ్యుల ఇంటికి పోలీసుల్ని పంపి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారు.(1/3) pic.twitter.com/ASWQxi73wN
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) November 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">టార్చర్ చేసి సలాం కుటుంబాన్ని మింగేసారు. అయినా @ysjagan ప్రభుత్వానికి రక్త దాహం తీరలేదు. రాత్రి పూట సలాం కుటుంబ సభ్యుల ఇంటికి పోలీసుల్ని పంపి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారు.(1/3) pic.twitter.com/ASWQxi73wN
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) November 11, 2020టార్చర్ చేసి సలాం కుటుంబాన్ని మింగేసారు. అయినా @ysjagan ప్రభుత్వానికి రక్త దాహం తీరలేదు. రాత్రి పూట సలాం కుటుంబ సభ్యుల ఇంటికి పోలీసుల్ని పంపి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారు.(1/3) pic.twitter.com/ASWQxi73wN
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) November 11, 2020
ఒక మైనార్టీ కుటుంబానికి ఇన్ని వేధింపులా? కుటుంబ సభ్యులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వారిని హింసించడం జగన్ రాక్షస మనస్తత్వానికి పరాకాష్ట. సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో సాక్ష్యాలు తారుమారు చేసి దోషులను కాపాడే కుట్ర జరుగుతోంది. ఈ కేసును సీబీఐకి అప్పగించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి. సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి- నారా లోకేశ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి
ఇదీ చదవండి
'డబ్బులు తీసుకుని పోస్టింగ్ ఇస్తే.... ఇలాంటి ఘటనలే జరుగుతాయ్'