కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి చేపట్టిన భూమి పూజ కార్యక్రమంలో శాసన మండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి పాల్గొన్నారు. మూడు కోట్ల వ్యయంతో ఆసుపత్రి భవనాన్ని నిర్మించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య ,వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని మండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆళ్లగడ్డలో ఉన్న 30 పడకల ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా మారుస్తుండటం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. 8 నెలల వ్యవధిలో ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేసి... పూర్తి సేవలను అందించేందుకు సిద్ధం చేయాలని ఇంజనీర్లకు సూచించారు. ప్రసూతి సేవల్లో రాష్ట్రంలోనే ఆళ్లగడ్డ ఆసుపత్రి మొదటి స్థానంలో ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఆసుపత్రిని వంద పడకలకు పెంచుతామని అన్నారు.
ఇదీ చదవండి: ఆరు రకాల పురుగు మందులపై ప్రభుత్వం నిషేధం