ETV Bharat / state

కర్నూలులో ఊపందుకున్న ప్రచారాలు.. - కర్నూలు మున్సిపల్ ఎన్నికలు

మున్సిపల్ ఎన్నికలలో భాగంగా తెదేపా జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది. పలు పార్టీల అగ్రనేతలు క్యాంపెయిన్​లో పాల్గొంటున్నారు. గెలుపు కోసం నేతలందరూ కృషిచేస్తున్నారు. కర్నూలు జిల్లాలోని నగరాలలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు నేతలు.

all political  parties campaign at Kurnool
కర్నూలులో ఊపందుకున్న ప్రచారాలు
author img

By

Published : Mar 8, 2021, 10:13 AM IST

10వ వార్డు అభ్యర్థి ప్రచారం..

కర్నూలు జిల్లా గూడూరులో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 10వ వార్డు అభ్యర్థిగా తెదేపా తరుపున బరిలో ఉన్న రేమాట సురేష్​ని గెలిపించాలని ఆదివారం ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో నగర పంచాయతీ మాజీ వైస్ ఛైర్మన్ రామాంజనేయులు, తెదేపా నేత రేమాట వెంకటేష్ పాల్గొన్నారు.

మేము ఉన్నంత వరకు ఎవరు భయపడవద్దు

తెదేపాను గెలిపిస్తే ప్రభుత్వ పథకాలు రావని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాజీమంత్రి, ఎమ్మెల్సీ ఎన్ఎండీ. ఫరూక్ అన్నారు. కర్నూలు జిల్లా నంద్యాల నడిగడ్డ ప్రాంతంలో మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డితో కలిసి తెదేపా ఎన్నికల తరుపున ప్రచారం నిర్వహించారు. మేము ఉన్నంత వరకు ఎవరు భయపడవద్దని ఆయన భరోసా ఇచ్చారు.

బహిరంగ సభ

కర్నూలు నగర పాలక సంస్థ ఎన్నికల్లో ప్రచారాలు చివరి దశకు చేరుకున్నాయి.. 52 వార్డులు ఉండగా 2 వార్డులను అధికార పార్టీ ఏకగ్రీవం చేసుకుంది. మిగిలిన 50 వార్డుల్లో తెలుగుదేశం, వైకాపా అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. 49వ వార్డులో తెదేపా అభ్యర్థి విక్రమ్ సింగ్ గెలుపు కోసం ఎమ్మెల్సీ కేఈ. ప్రభాకర్, కర్నూలు తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీజీ. భరత్ ప్రచారంలో పాల్గొన్నారు. పాత నగరంలో వైకాపా ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. సభలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పార్లమెంట్ మాజీ సభ్యురాలు బుట్టారేణుకా పాల్గొన్నారు.

ఇదీ చూడండి. వైకాపాను నమ్మితే మీ బిడ్డల భవిష్యత్తుకే ప్రమాదం: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.