ఎన్నికలకు ముందు అగ్రిగోల్డ్ బాధితులకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ.. కర్నూలులో అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరహార దీక్ష చేపట్టారు. నగరంలోని సీపీఐ కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితులు భౌతిక దూరం పాటిస్తూ.. 48 గంటల దీక్షకు దిగారు.
బడ్జెట్లో కేటాయించిన 1,150 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చెయ్యాలని కోరారు. సీఎం జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని సీపీఐ నాయకుడు రామాంజనేయులు విమర్శించారు.
ఇవీ చదవండి: