క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముస్తాక్ మహమ్మద్‌ను కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి దగ్గర నుంచి 5లక్షల 11వేల నగదు, 7 చరవాణులు, టీవీ స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు.
ఆన్లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను గతనెలలో అరెస్టు చేశామని, దానికి ప్రధాన సూత్రధారి అయిన ముస్తాక్ మహమ్మద్ పరారయ్యాడని వివరించారు. హైదరాబాద్‌లో నివసిస్తూ లావాదేవీలు చేస్తున్నట్లు గుర్తించి అరెస్టు చేశామని చెప్పారు.
ఇదీ చదవండి: