ETV Bharat / state

కర్నూలు జిల్లా యువతి పెళ్లికి... కరోనా గండం..! - చైనా కరోనా వైరస్ వార్తలు

కరోనా వైరస్ విలయతాండవం చేస్తోన్న వూహాన్​ నగరంలో... కర్నూలు జిల్లాకు చెందిన ఓ యువతి కష్టాలు పడుతోంది. శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉందన్న కారణంతో ఆమెను రెండు రోజుల కిందట స్వదేశానికి వచ్చిన విమానంలో అనుమతించలేదు. తనకు ఎలాంటి వైరస్ లేదని బాధితురాలు చెబుతున్నారు. ఈ నెల 14న ఆమెకు వివాహం జరగాల్సి ఉంది.

a-young-woman-from-kurnool-district-is-stucked-in-china

author img

By

Published : Feb 2, 2020, 6:20 PM IST

Updated : Feb 2, 2020, 11:28 PM IST

కర్నూలు జిల్లా యువతి పెళ్లికి... కరోనా గండం..!

కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న చైనాలోని వూహాన్​ ప్రాంతంలో... కర్నూలు జిల్లా యువతి చిక్కుకుంది. గతేడాది ఆగస్టులో శిక్షణకు వెళ్లిన తిరుపతిలోని టీసీఎల్​సెల్​ కంపెనీకి చెందిన 58 మంది ఉద్యోగుల్లో అందరూ స్వదేశానికి తిరిగి రాగా... ఇద్దరు అక్కడే మిగిలిపోయారు. వీరిలో కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామానికి చెందిన అన్నెం జ్యోతి ఒకరు. ఆమెకు 99.5 ఫారిన్​హీట్ జ్వరం ఉందన్న కారణంతో రెండు రోజుల కిందట స్వదేశానికి వచ్చిన విమానంలో అనుమతించలేదు. జ్యోతి తాను ఎదుర్కొంటున్న కష్టాలను వీడియో కాల్ ద్వారా తన తల్లి, బంధువులకు వివరించారు. అక్కడే మిగిలిపోయిన ఇద్దరినీ చెరోచోట ఉంచారని... తినడానికి తిండి, మందులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జ్యోతికి మహానంది మండలం తమడపల్లెకు చెందిన యువకుడితో నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 14న వివాహ ముహూర్తం నిర్ణయించారు. ఈలోగా అనుకోకుండా చైనాలో చిక్కుకుపోయిందని, ప్రభుత్వం స్పందించి తన బిడ్డను స్వస్థలానికి తీసుకురావాలని ఆమె తల్లి ప్రమీలాదేవీ, బంధువులు కోరుతున్నారు.

వూహాన్​లో ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. నేను నా సహచరులతో కలిసి విమానం ఎక్కేందుకు వెళ్లాను. కానీ శరీర ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నందున నన్ను, మరొకరిని విమానం ఎక్కకుండా నిలిపివేశారు. మాకు ఎలాంటి వైరస్ సోకలేదని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒత్తిడి, భయం వల్ల మా శరీర ఉష్ణోగ్రత ఆ సమయంలో పెరిగింది. అంతేకానీ మాకు కరోనా వైరస్ లేదు. అందువల్ల మమ్మల్ని తిరిగి భారత్​కు రప్పించేందుకు ప్రభుత్వం సహకరించాలి- జ్యోతి, బాధితురాలు

ఇదీ చదవండి

కరోనా ఎఫెక్ట్​: ఈ-వీసాలను నిలిపివేసిన భారత్​

Last Updated : Feb 2, 2020, 11:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.