కర్నూలు జిల్లాలో ప్రియుడుతో కలిసి భర్తను భార్య హత్య(wife murdered her husband) చేసింది. వివాహేతర సంబంధ కారణంతో ఈ హత్య జరిగినట్లు డీఎస్పీ మహేశ్ తెలిపారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడకు చెందిన రామయ్య - జయలక్ష్మి దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే జయలక్ష్మి.. అదే గ్రామానికి చెందిన కైజర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో కైజర్, జయలక్ష్మి ఇద్దరు కలిసి గత నెల 13న రామయ్యను హత్య చేశారని డిఎస్పీ మహేశ్ తెలిపారు. హత్య చేసిన పదిరోజుల తరువాత జయలక్ష్మి.. తన భర్త రామయ్య కనబడటంలేదని ఓర్వకల్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసుల విచారణలో రామయ్యను అతని భార్యనే హత్యచేసినట్లు తెలింది. హత్యం అనంతరం మృతదేహాన్ని హెచ్ఎన్ఎస్ఎస్(HNSS) కాల్వలో పడేసినట్లు తెలియడంతో డెడ్ బాడీకో కాల్వలో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. రామయ్య మృతదేహాన్ని గుర్తించారు. హత్యకు పాల్పడిన జయలక్ష్మి, కైజర్పై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి..
daughter killed mother : అమానుషం... తల్లిని దారుణంగా హత్య చేసిన కుమార్తె