కర్నూలు జిల్లా బండిఆత్మకూరు మండలం పెద్ద దేవలాపురం గ్రామానికి చెందిన రమేశ్ అనే కౌలు రైతు పురుగుల మందు తాగి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామంలో నాలుగెకరాల పొలాన్ని అతను కౌలుకు తీసుకుని వరి పంట సాగు చేశాడు. ఇటీవల కురిసిన వర్షానికి చెరువు నిండి పంట నీట మునిగింది. మనస్థాపానికి గురైన రమేశ్...పురుగు మందు తాగి ప్రాణం తీసుకున్నాడు. ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ఇదీ చదవండి
కోరిక తీర్చలేదో ఉద్యోగం పోతుంది... వాలంటీర్కు వైకాపా నేత బెదిరింపు