కర్నూలు జిల్లా పాణ్యం సమీపంలోని నూలు మిల్లు వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. రాళ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్న.. విజయవాడకు చెందిన అదనపు డ్రైవర్ రాజ్ కుమార్ మరణించాడు. మరో ముగ్గురికి గాయాలు కావడంతో శాంతిరాం వైద్యశాలకు తరలించారు. హైదరాబాద్ నుంచి కడప కు మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకువెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సంఘటనా స్థలాన్ని పాణ్యం సీఐ జీవన్ గంగనాథ్ బాబు పరిశీలించి ప్రమాద వివరాలను తెలుసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండీ.. Third wave : నిర్లక్ష్యానికి భారీ మూల్యం తప్పదా..!