కర్నూలు జిల్లా అదోనిలో ద్విచక్ర వాహనంపై అక్రమ మద్యం తరలిస్తున్న ఈరన్న రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. మదిరే గ్రామ క్రాస్ దగ్గర సాయంత్రం గుర్తు తెలియని వాహనం ఢీకొని ఆదోనికి చెందిన యువకుడు మృతి చెందాడు.
అదోనికి అక్రమ రవాణా..
మృతి చెందిన యువకుడు కర్ణాటక ప్రాంతం నుంచి ఆదోనికి అక్రమ రవాణా చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ద్విచక్ర వాహనంపై తరలిస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించాడు. ఘటనలో ఒకరికి గాయాలయ్యాయని పోలీసులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి : బాల్య వివాహం చేసిన తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్నారి