కర్నూలు జిల్లా ఆలూరు మండలం మనేకుర్తి గ్రామంలో నడిపిలింగన్న అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి నాలుగున్నర లక్షలకు పైగా అప్పులు ఉండటంతో.. వాటిని తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులంటున్నారు. గత రెండేళ్లగా పంటలు సక్రమంగా పండకపోవడం... చేసిన అప్పులు తీర్చలేకపోవడంతో బతుకు భారమై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
ఇదీ చూడండి:పసివాడని చూడకుండా.. పొట్టనబెట్టుకున్నాడు!