కర్నూలు జిల్లా పత్తికొండలో ఉద్రిక్తత నెలకొంది. వైకాపా ఎమ్మెల్యే శ్రీదేవి, అదే పార్టీకి చెందిన పోచంరెడ్డి మురళీధర్ రెడ్డి అనుచరుల మధ్య ఘర్షణ జరిగింది. పట్టణంలోని తేరుబజారులో పత్తికొండ మాజీ సర్పంచ్ సోమశేఖర్ కొడుకులు మధు, గోవర్ధన్ టీ దుకాణం వద్ద ఉండగా... పోచంరెడ్డి మురళీధర్ రెడ్డి యువ సైన్యానికి చెందిన యువకులు రాళ్ల దాడి చేశారు.
ఈ ఘటనలో గోవర్థన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు రావటంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించిన భాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గోవర్థన్ సోదరుడు మధు కోరారు.
ఇదీ చదవండి