పాఠశాలకు వెళ్లొద్దని చెప్పటంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆదోని మండల పరిధిలో జరిగింది. 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని తల్లిదండ్రులు వలస వెళ్లారు.
తాను మాత్రం సొంత అన్నతో కలిసి గ్రామంలోనే ఉంటూ చదువుకుంటోంది. అయితే.. బడికి వెళ్లే విషయంలో అన్నా చెల్లెలు ఘర్షణ పడ్డారు. బడికి వెళ్లొద్దని అన్న తేల్చి చెప్పడంతో.. మనస్థాపానికి గురైన చెల్లి.. క్షణికావేశంలో పురుగుల మందు తాగి ఆత్యహత్యకు యత్నించింది. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగానే ఉందని.. ప్రస్తుతం చికిత్స అందుతోందని విద్యార్థిని మేనత్త వెల్లడించారు.
ఇదీ చదవండి
"నొప్పి పెడుతోంది కీర్తి.. మంచినీళ్లు ఇవ్వు" గౌతమ్ రెడ్డి చివరి మాటలు!