ETV Bharat / state

ఎస్సైలు 'సైరా' అంటే.. ఎస్పీ వీఆర్ అన్నారు! - సినిమా అభిమానం

సినిమా అభిమానం ఎస్సైల కొంప ముంచింది. విధులు నిర్వహించకుండా సైరా సినిమాకు వెళ్లిన ఆరుగురు ఎస్సైలపై ఎస్పీ మండిపడ్డారు. ఆరుగురినీ వీఆర్ కు పంపిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

si
author img

By

Published : Oct 2, 2019, 11:46 AM IST

Updated : Oct 2, 2019, 2:30 PM IST

సినిమా అభిమానం కర్నూలు జిల్లాలో ఆరుగురు ఎస్సైల ఉద్యోగం మీదకు తెచ్చింది. ఇవాళ విడుదలైన సైరా నరసింహారెడ్డి సినిమాకు వెళ్లిన ఆరుగురు ఎస్‌ఐలపై.... కర్నూలు జిల్లా ఎస్పీ వేటు వేశారు. ఆరుగురు ఎస్సైలు కోవెలకుంట్లలోని.... సినిమా థియేటర్‌కు వెళ్లారు. సినిమా చూస్తుండగానే ఉన్నతాధికారులకు సమాచారం అందింది. గాంధీ జయంతి, కొత్త గ్రామ, వార్డు సచివాలయాల ప్రారంభోత్సవాల వంటి కీలక కార్యక్రమాల బందోబస్తు వదిలేసి... సమాచారం ఇవ్వకుండా సినిమాకెళ్లారని ఆగ్రహం వ్యక్తంచేసిన కర్నూలు ఎస్పీ ఫక్కీరప్ప.... ఆరుగురినీ వీఆర్ కు పంపిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Intro:Reporter... శ్యామ్

( ) కర్నూలు జిల్లాలో సినిమాకు వెళ్లిన ఆరుగురు ఎస్ఐ లపై వేటు పడింది. Body:ఇవాళ సైరా నరసింహారెడ్డి సినిమా విడుదలైంది. ఈ సినిమాను చూసేందుకు ఆరుగురు ఎస్ఐ లు కోవెలకుంట్లలోని సినిమా థియేటర్ కు వెళ్లారు. Conclusion:సినిమా చూస్తుండగానే ఉన్నతాధికారుకు సమాచారం అందింది. గాంధీ జయంతి, కొత్త పంచాయతీ కార్యాలయాల ప్రారంభోత్సవాలు, మంత్రులు, ప్రజాప్రతినిధుల కార్యక్రమాలు ఉండటంతో... సమాచారం ఇవ్వకుండా, శాంతి భద్రతలను గాలికి వదిలి... నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐ లను వీఆర్ కు పంపుతూ ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశాలు జారీ చేశారు.
Last Updated : Oct 2, 2019, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.