కర్నూలు జిల్లాలోని కృష్ణగిరి మండలం పరిధిలోని జాతీయ రహదారిపై డోన్ మండలంలోని అమకతాడు టోల్ ఫ్లాజా వద్ద అనుమతి లేకుండా తరలిస్తున్న వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం భారీగా వెండిని తరలిస్తున్నట్లు సమాచారం రావటంతో టోల్‌ప్లాజా వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్ నుంచి తమిళనాడులోని సేలం వెళ్తున్న కారు వెనుక భాగంలో సంచుల్లో ఉన్న వెండిని గుర్తించారు. దాదాపు 686.5 కిలోల మేర ఉండవచ్చని, దీని విలువ దాదాపు రూ.4.35 కోట్లుగా పోలీసులు భావిస్తున్నారు. బాలుడితో సహా ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: