కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో స్నేహితులతో కలిసి చెరువులో సరదాగా ఈతకు వెళ్లి సునీల్ అనే యువకుడు గల్లంతయ్యాడు. జగనన్న కాలనీ చెరువులో సునీల్ స్నేహితులతో ఈత కొడుతుండగా గల్లంతయ్యాడు. అతని స్నేహితులు అందించిన సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అతని ఆచూకీ కనిపెట్టలేకపోయారు.
వెంటనే అధికారులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు.. సునీల్ ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చెరువులో జల్లెడ పడుతున్నాయి. సునీల్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. సునీల్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
ఇదీ చదవండి: 'మిమ్మల్ని చూసి గర్విస్తున్నాం'.. హాకీ జట్టుకు అభినందనల వెల్లువ