ETV Bharat / state

Illegal Sand Excavation: వైసీపీ నాయకుల దౌర్జన్యం.. రైతుల భూముల్లో అక్రమ తవ్వకాలు - Irregularities of YCP leaders

YSRCP Leaders Illegal Sand Excavation: రాబందుల్ల మారి రైతుల భూముల్లో అక్రమ ఇసుక తవ్వకాలు చేపట్టి.. రైతులనే బెదిరిస్తూ అరాచకాలకు పాల్పడుతున్నారు వైసీపీ నాయకులు. తవ్వకాలకు అడ్డొస్తే ప్రాణాలతో ఉండరని భయబ్రాంతులకు గురి చేస్తూ.. తమ భూముల వైపు కూడా రానీయటం లేదని రైతులు వాపోతున్నారు. ఎవరికి మొర పెట్టుకున్నా తమ సమస్య పరిష్కారం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

YSRCP Leaders Illegal Sand
వైసీపీ నాయకుల ఇసుక అక్రమాలు
author img

By

Published : Jul 23, 2023, 8:01 AM IST

రోజురోజుకీ శ్రుతి మించుతున్న వైసీపీ నేతల ఇసుక ఆగడాలు

YSRCP Leaders Illegal Sand Mining: రోజురోజుకీ వైసీపీ నేతల అక్రమాలు మితిమీరిపోతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇసుక, బుసకను తరలిస్తూ కోట్లు దండుకుంటున్నారు. ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలోని 'ముదిరాజ్ ఫీల్డ్ లేబర్ కో-ఆపరేటివ్ సొసైటీ' పరిధిలోని 110 ఎకరాల భూమిని సంబంధిత రైతులను బెదిరించి యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారు. క్వారీలోకి ఎవరైనా అడుగుపెట్టకూడదని బెదిరిస్తూ.. దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ రైతులు వాపోతున్నారు.

ఘంటసాల మండలం శ్రీకాకుళం సమీపంలోని కృష్ణానదిలో సర్వే నెంబరు 176 లోని 110 ఎకరాలను.. 65 ఏళ్ల క్రితం చల్లపల్లిరాజావారి నుంచి ముదిరాజ్ ఫీల్డ్ లేబర్ కో-ఆపరేటివ్ సొసైటీ సభ్యులు కొనుగోలు చేశారు. మూడేళ్ల క్రితం వరకు రైతులు ఈ భూముల్లో పంటల్ని సాగు చేస్తూ వచ్చారు. అప్పట్లో కృష్ణా నదికి భారీ స్థాయిలో వరదలు రావడంతో నీటి ప్రవాహానికి వందల ఎకరాల్లో పంట కొట్టుకుపోయింది. దీంతో అప్పటి నుంచి రైతులు ఆ భూమిల్లో సాగుని తగ్గించారు.

నాటి నుంచే వైసీపీ నాయకుల కన్ను ఆ భూములపై పడింది. దొరికిందే తడవుగా ఆ భూముల్లో అక్రమంగా ఇసుక, బుసక తవ్వకాలు చేపట్టారు. ఇప్పటికే 15 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో 30 అడుగుల లోతున మట్టిని కొల్లగొట్టారు. న్యాయం చేయాలని రైతులు తహశీల్దార్‌ని ఆశ్రయించగా.. తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశించారు. ఒకటి, రెండు రోజులు తవ్వకాలు నిలిపివేసిన అక్రమార్కులు.. తిరిగి యథేచ్ఛగా తవ్వకాలు ప్రారంభించారు. దీంతో రైతులు స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల్లో చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు కానీ.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు వాపోతున్నారు.

"నిరుపేద ముదిరాజ్​ రైతులకు అన్యాయం జరుగుతోంది. యథేచ్చగా తవ్వకాలు జరుగుతున్నాయి. భారీగా గుంతలు తీస్తున్నారు. అవి ఇప్పట్లో కూడిపోవు." -నాగరాజు, రైతు

"కృష్ణా నది వరదల వల్ల ఇసుక మేటలు ఏర్పడటంతో పంటలకు అనుకూలంగా లేదు. ఇదే అదనుగా తీసుకుని ఇసుక, బొసక అక్రమ తవ్వకాలు చేపట్టారు. ఎంతమంది అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండాపోయింది." -రామాంజనేయులు, రైతు

రైతుల ఫిర్యాదు చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో తవ్వకాల్ని నిలిపివేయకపోగా.. తవ్వకాల్లో మరింత వేగం పెంచారు. మట్టి తవ్వకాలు చేసే ప్రాంతానికి ఎవరైనా వస్తే.. టిప్పర్లలో వేసుకుని తిరిగి రాకుండా చేస్తామని అధికార పార్టీ నాయకులు బెదిరిస్తున్నారని రైతులు వాపోయారు. వైసీపీ నాయకుల బెదిరింపులతో తమ భూముల వద్దకు కూడా వెళ్లలేని దుస్థితిలో ఉన్నామని శ్రీకాకుళం ముదిరాజ్ ఫీల్డ్ లేబర్ కో-ఆపరేటివ్ సొసైటీ సభ్యులు చెబుతున్నారు. ఈటీవీ ప్రతినిధుల సాయంతో తమ భూముల వద్దకు రాగలిగనట్లు తెలిపారు. మట్టిని అక్రమంగా తవ్వుకుపోతున్నా అధికార పార్టీ నాయకులు ఒక్క రూపాయి కూడా సొసైటీకి చెల్లించడం లేదు. దీనిపై అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని స్థానికులు ఆరోపించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.