ETV Bharat / state

తండ్రి అడుగుజాడల్లో సీఎం జగన్ నడుస్తున్నారు: కొడాలి నాని - గుడివాడలో వైయస్సార్ జయంతి వేడుకల్లో మంత్రి కొడాలి నాని

కృష్ణా జిల్లా గుడివాడలో వైఎస్​ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి నివాళి అర్పించారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

ys rajasekhareddy birth anniversary in gudivada krishna district
గుడివాడలో వైయస్సార్ జయంతి వేడుకలు
author img

By

Published : Jul 8, 2020, 12:53 PM IST

వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లోనే ఆయన కుమారుడు జగన్ నడుస్తున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు.

సాంకేతిక లోపాల కారణంగా వాయిదా పడిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు 15న అమలు చేస్తామని మంత్రి నాని చెప్పారు. ముఖ్యమంత్రిగా జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైకాపా నేతలు, అభిమానులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి..

'ఇళ్ల పట్టాల పంపిణీని తెదేపా అడ్డుకుంటుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.