తనకు బినామీ భూములు లేవని వంగవీటి రంగా హత్య కేసు నిందితుడైన వెలగపూడి రామకృష్ణ ప్రమాణం చేస్తారా అని వైకాపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. బినామీ భూములు లేకపోతే ఎందుకు ఉలిక్కిపడుతున్నారని అన్నారు. ఈ విషయాలన్నింటికీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
దేవుడి మీద ప్రమాణం చేస్తానని వెలగపూడి రామకృష్ణ సవాల్ విసిరినట్టు మీడియాలో చూశానని అన్నారు. దేవుడంటే ఆయనకు నమ్మకం లేదని, పాప భీతి లేదు కాబట్టే ఇలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీచదవండి.