ETV Bharat / state

ఓటర్ల జాబితాలో తప్పులపై ఎస్ఈసీకి ఫిర్యాదు - krishna district latest news

విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల జాబితాలో తప్పులు జరిగాయని వైకాపా నేత పిల్లి వెంకటేశ్వరరెడ్డి అన్నారు. ఈ అంశంపై ఓటర్ల జాబితాను సవరించాలని అధికారులను కోరినప్పటికీ, సరైన స్పందన లేదని తెలిపారు. ఫలితంగా ఎస్ఈసీ కి ఫిర్యాదు చేసినట్లు వెంకటేశ్వరరెడ్డి వెల్లడించారు.

ycp leader pilli venkateshwarareddy complaint to sec for voter list correction
వైకాపా నేత పిల్లి వెంకటేశ్వరరెడ్డి
author img

By

Published : Mar 4, 2021, 7:42 PM IST

విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల ఓటర్ల జాబితాలో జరిగిన తప్పులపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్​కు ఫిర్యాదు చేసినట్లు వైకాపా నేత పిల్లి వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. నగరంలో డివిజన్ల సంఖ్య పెరుగుదలతో తమ డివిజన్​లో ఉండాల్సిన ఓట్లు లేకుండాపోయాయని, ఇలా ప్రతి డివిజన్​లో వందల సంఖ్యలో ఓట్లు వేరే డివిజన్లలో నమోదు కావడంతో గందరగోళం నెలకొందని ఆయన అన్నారు. ఈ అంశంపై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ... జాబితాను సరిచేయలేదని వెంకటేశ్వరరెడ్డి ఆక్షేపించారు.

ఇదీచదవండి.

నేను అభివృద్ధి చేస్తే.. జగన్ విధ్వంసం సృష్టిస్తున్నాడు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.