ETV Bharat / state

'సాగునీటి రంగాన్ని వైకాపా ప్రభుత్వం భ్రష్టు పట్టించింది'

ఏడాదిన్నరగా ముఖ్యమంత్రి జగన్ సాగునీటి రంగాన్ని భ్రష్టు పట్టించారని మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమ విమర్శించారు. ఏడాదిన్నరగా పోలవరంపై ఎంత ఖర్చు చేశారో మంత్రి అనిల్​ చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.

devineni uma
devineni uma
author img

By

Published : Nov 2, 2020, 8:09 PM IST

అయిదేళ్ల పాలనలో 62 ప్రాజెక్టులను తెదేపా ప్రభుత్వం పరిగెత్తిస్తే... వైకాపా ప్రభుత్వం 6 ప్రాజెక్టులకు కూడా సరిగా నిధులు ఖర్చు చేయట్లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. తెదేపా హయాంలో 70 శాతం పోలవరం పనులు జరగలేదన్న వైకాపా నేతల విమర్శలను ఆయన తిప్పికొట్టారు. పోలవరం పనులు 69.54శాతం పూర్తయ్యాయని ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్​లో ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిందని గుర్తు చేశారు.

ఏడాదిన్నరగా పోలవరంపై ఎంత ఖర్చు చేశారని మంత్రి అనిల్​ని అడిగితే గూగుల్ కొట్టమంటున్నారని మండిపడ్డారు. జలవనరుల శాఖ మంత్రిగా అనిల్ చేయాల్సింది గూగుల్​లో వెతకడమా అని నిలదీశారు. వైకాపా సొంత మీడియాలోనూ తెదేపా ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులకు ఎంత ఖర్చు పెట్టిందో వాస్తవాలు వెల్లడించారని దేవినేని అన్నారు. ఏడాదిన్నరగా జగన్ సాగునీటి రంగాన్ని భ్రష్టు పట్టించిన అంశాన్ని ఆ కథనంలో ఒప్పుకున్నారని తెలిపారు. మరోవైపు తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవటానికి అమరావతి రైతులు, మహిళలపై అక్రమ కేసులు పెట్టి కక్ష సాధిస్తున్నారని దేవినేని పేర్కొన్నారు.

ఇదీ చదవండి

పోలవరం నిర్మాణ ఖర్చులపై పీపీఏ భిన్న సమాధానాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.